మెంటలెక్కిస్తున్న రాంగోపాల్ వర్మ

 

ఈ రాంగోపాల్ వర్మ తనకు మెంటల్ ఎక్కిందని ప్రూవ్ చేసుకోవడమే కాకుండా తెలుగు జనాలకి కూడా మెంటల్ ఎక్కించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తు్న్నాడు. ఒకప్పుడు సినిమా దర్శకుడిగా జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగినా ఆ తర్వాత నీచ నికృష్ట సినిమాలు తీస్తూ వుండే సరికి బాలీవుడ్ ఆయన్ని తిరిగి టాలీవుడ్‌కి తరిమింది.  ఒకప్పుడు తెలుగులో సినిమాలే తీయనంటూ పోజులు కొట్టిన వర్మ చివరికి తెలుగులోనే దిక్కుమాలిన, నీచ నికృష్టమైన సినిమాలు తీశాడు. మొదట్లో రెండు మూడు సినిమాలకు జనాలు వెళ్ళి థియేటర్లలోనే  డోక్కుని, ఆ తర్వాత వర్మ సినిమాలు ప్రదర్శితమయ్యే థియేటర్ల వైపు కూడా వెళ్ళడం మానుకున్నారు. జనాలు చూడ్డం లేదని తెలిసి కూడా ఎవరో ఒకరి నెత్తిన చెయ్యి పెట్టి సినిమాలు తీస్తే నిర్మాత నెత్తిన గుడ్డ వచ్చేలా చేస్తున్న వర్మ, తన ప్రతాపాన్ని సినిమాలతో ఆపకుండా జనాల మీద కూడా, రాజకీయ రంగం మీద కూడా ప్రదర్శిస్తూ తన శాడిజాన్ని సంతృప్తి పరుచుకుంటున్నాడు. కోతికి కొబ్బరిచిప్ప దొరికిందన్నట్టుగా ఆయనకు ఆ ట్విట్టర్ ఒకటి దొరికింది. దాంట్లో ఆయన తన మురికి బుర్రకి తోచిన కామెంట్లు చేసేస్తున్నాడు. ఈ మీడియా కూడా ఆయన ఏం కూసినా దానికి బోలెడంత పబ్లిసిటీ ఇచ్చి తరిస్తోంది.

దేవతల మీద, కేసీఆర్ మీద... ఇలా దేనిమీద పడితే దాని మీద ఎవరి మీద పడితే వాళ్ళ మీద తన దిక్కుమాలిన కామెంట్లు విసురుతున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడ్డాడు. ఆయన ఎప్పుడో అన్యాయం జరిగే పోరాటం చేస్తానని అన్నాడట, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్యాయాలు జరిగిపోతున్నా లోక కళ్యాణం కోసం పోరాటం చేయడం లేదట... ఈయన చేసే ట్విట్లకి అవతలి వ్యక్తులు స్పందించడం లేదుగానీ, జనాలకే  చిరాకు పుట్టుకొస్తోంది.  ఈయనగారి నస భరించలేక చాలామంది కేసులు వేసినా అవన్నీ ఏ మూలకు వెళ్ళిపోయాయో అర్థం కాని పరిస్థితి. బురదలో దొర్లి బయటకి వచ్చిన వరాహాన్ని అయినా కంట్రోల్ చేయొచ్చేమోగానీ  చాలా రాంగ్‌ పర్సన్‌గా మారిపోయిన రామ్ గోపాల్ వర్మను కంట్రోల్ చేయడం మాత్రం కష్టం అని జనం అనుకునే పరిస్థితి వచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu