ఏమన్నా ప్లాన్ వేశావా రేవంత్...!

 

తెలంగాణ టీడీడీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి పార్టీకి పెద్ద షాకే ఇచ్చాడు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు అన్న వార్తలను నిజం చేశాడు. గత కొద్దిరోజులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తాను పార్టీ మారడం లేదని యూటర్న్ తీసుకున్నా కానీ.. సడెన్ గా పార్టీకి రాజీనామా చేసి షాకిచ్చాడు. ఇక కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే లేట్. ఇప్పటికే రేవంత్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్.. వాగ్దాటి తెలిసిన నేతలు.. పైగా కేసీఆర్ పై ధైర్యంగా ఏదైనా మాట్లాడగలిగిన వ్యక్తి కావడంతో రేవంత్ డిమాండ్లకు కూడా కాంగ్రెస్ ఒప్పుకున్నట్టు గుసగుసలు వినిపించాయి. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా..పార్టీ మార్పు విషయంలో రేవంత్ రెడ్డి పక్కా వ్యూహాన్నే అనుసరించినట్టు కనబడుతుంది. ఎందుకంటే ముందు పార్టీ మారబోతున్నట్టు వచ్చిన వార్తలను ఖండించిన రేవంత్...ఆసమయంలోనే టీడీపీ నేతలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఇక రేవంత్ చేసిన వ్యాఖ్యలకుగాను... టీడీపీ పొలిటిబ్యూరో సమావేశంలో ఆయన ప్రవర్తించిన తీరుకు గాను ఏపీ, తెలంగాణ టీడీపీ నేతలు సైతం ఆయనపై మండిపడ్డారు. అంతేకాదు ఆయనపై వేటు వేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇక్కడే రేవంత్ రెడ్డి వ్యూహాన్ని పన్నినట్టు తెలుస్తోంది. ముందు టీడీపీ నేతలను విమర్శించినా.. ఆతరువాత టీడీపీ పై ఆయన ఎలాంటి ఆరోపణలు చేయలేదు. సైలెంట్ గా ఉన్నాడు. రేవంత్ సైలెంట్ గా ఉన్నా.. కొంతమంది టీడీపీ పెద్దలు మాత్రం ఆయనపై దుమ్మెత్తి పోశారు. ఇది రేవంత్ కు ప్లస్ పాయింట్ అయింది. అందుకే అవన్నీ సాకుగా చూపిస్తూ...  చంద్రబాబుకు మర్యాదపూర్వక వాతావరణంలోనే రాజీనామా లేఖ అందజేశారు. ఇక ఈ వ్యవహారం అంతా జరగకముందే... ముందుగానే ఢిలీల్లో కాంగ్రెస్ పెద్దలతో డీల్ కుదుర్చుకొన్న రేవంత్.. ఆ పార్టీ నేతల నుంచి తనకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడ్డారు. రేవంత్ రెడ్డి తన రాజకీయానుభవాన్ని చూపించాడు. ఇది ఆయన రాజకీయ పరిణితికి నిదర్శనంగా చెప్పవచ్చు. మొత్తానికి తానొవ్వక...ఎవరిని నొప్పించక అన్న సామెత ప్రకారం అటు టీడీపీ అధినేతకు గానీ... ఇటు కాంగ్రెస్ కు కానీ తనపై ఎలాంటి వ్యతిరేకతభావం ఏర్పడకుండా చేసుకొని మరీ కాంగ్రెస్ లో చేరుబోతున్నాడు. మరి ఈరకంగా అయినా రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ఎదుర్కొవాలనే ఆయన లక్ష్యం నెరవేరుతుందో..?లోదో..? చూద్దాం..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu