రేపటి రేవంత్ సమావేశానికి "నో పర్మిషన్"
posted on Oct 29, 2017 7:37PM
.jpg)
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తన తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఏమిటీ..? ఇప్పుడే కాంగ్రెస్ కండువా కప్పుకుంటాడా..? గ్యాప్ తీసుకుంటాడా..? అన్నది తెలియక అందరు జుట్టు పీక్కుంటున్నారు. ఇలాంటి వారికి సమాధానంగా రేపు జలవిహార్ వేదికగా ఫ్యూచర్ ప్లాన్ చెబుతానని ప్రకటించారు. దీంతో అందరి చూపు రేపటి సమావేశం మీదే పడింది. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారు పోలీసులు. రేపు నెక్లెస్‌రోడ్ జలవిహార్ వద్ద నిర్వహించ తలపెట్టిన ఆత్మీయ సమావేశానికి సిటీ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి వద్దే సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు తన ఇంటి వద్దకే రావాలని రేవంత్ పిలుపునిచ్చారు.