రాజీనామా చేసి చంద్రబాబు ఆశీర్వాదం తీసుకున్నా
posted on Oct 29, 2017 5:07PM
.jpg)
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ రేవంత్ రెడ్డి. ఆయన పార్టీ మారతారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి.. కానీ ఎప్పుడు మారేది చెప్పలేదు. చంద్రబాబు విదేశాల నుంచి వచ్చిన తర్వాత తన నిర్ణయాన్ని చెబుతానని చెప్పిన రేవంత్.. అధినేత బుజ్జగింపులకు కరిగిపోతారని అందరూ అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అధినేత వద్దకు రాజీనామా లేఖను తీసుకెళ్లి షాక్ ఇచ్చారు. పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేసి తిరిగొచ్చేశారు. ఇవాళ కొడంగల్‌లో కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. తాను అమరావతిలో చంద్రబాబు నాయుడిని కలిసి.. తెలంగాణలో ఉన్న పరిస్థితులను గురించి వివరించి.. వారి ఆశీర్వాదం తీసుకొని.. బెజవాడ కనకదుర్గమ్మకు దండం పెట్టి కొడంగల్‌కు వచ్చినా.. మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతా.. ఆ విశ్వాసం తగ్గకుండా చంద్రశేఖర్‌రావుకు గుణపాఠం చెబుతానని రేవంత్ అన్నారు.