5 గంటల తరువాత రేవంత్ విడుదుల
posted on Jul 1, 2015 5:13PM

ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి బెయిల్ ఆర్డర్ కు లైన్ క్లియర్ అయింది. హైకోర్టు రేవంత్ కు నిన్ననే బెయిల్ మంజూరు చేసిన తీర్పు ప్రతిలో సాంకేతిక లోపం కారణంగా రేవంత్ ఇంకా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే కోర్టు ఇప్పుడు ఆ సందిగ్ధతను తొలగించింది. నిన్న తీర్పు ప్రతిలో బెయిల్ పేపర్స్‌ను ఏసీబీ పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని రాసి ఉంది. అయితే దానిపై రేవంత్ తరఫు న్యాయవాదులు బెయిల్ పేపర్స్‌ను ఏసీబీ కోర్టులో సమర్పించే విధంగా ఆర్డర్స్ సవరించాలని బుధవారం పిటిషన్ వేశారు. దీంతో న్యాయమూర్తి బెయిల్ ఆర్డర్‌లో మార్పులు చేశారు. న్యాయమూర్తి సవరించిన బెయిల్ ఆర్డర్ కాపీని రేవంత్ తరఫు న్యాయవాదులు తీసుకొని దానిని ఏసీబీ కోర్టులో సమర్పించారు. అనంతరం ఏసీబీ కోర్టు నుంచి రిలీవ్ ఆర్డర్స్ తీసుకుని చర్లపల్లి జైలుకు వెళ్లనున్నారు. మొత్తానికి ఐదు గంటల తర్వాతే రేవంత్ రెడ్డి జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.