రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు లంచం ఇస్తూ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అతనిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. శుక్రవారం లోగా కౌంటర్ దాఖలు చేయాలని, ఆరోజే వాదనలు వింటామని కోర్టు ఏసీబీని ఆదేశించింది.