ఫైబర్ నెట్ ఉద్యోగుల తొలగింపు: జీవీ రెడ్డి 

అపాయింట్ మెంట్ లెటర్లు లేని 410 మంది ఉద్యోగులను తొలగించినట్టు ఎపి ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. వైకాపా నేతల ఇళ్లలో వంట మనుషులు, డ్రైవర్లుగా చేసిన వారిని ఫైబర్ నెట్ సంస్థలో ఉద్యోగాలు ఇచ్చినట్టు  ఆయన ఆరోపించారు. ఇంటర్నెట్, కేబుల్ సర్వీసులను అత్యంత చౌకగా ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైబర్ నెట్ ప్రారంభించారని  ఆయన తెలిపారు. 2019లో పది లక్షల కనెక్షన్ లు ఉన్న ఫైబర్ నెట్ 2024 నాటికి ఐదు లక్షలకు పడిపోయిందన్నారు.