సంక్రాంతి సందర్బంగా చంద్రబాబు మాస్ వార్నింగ్
posted on Dec 24, 2024 5:39PM
సంక్రాంతికి ఇంకా మూడు వారాలు మాత్రమే ఉంది. పండుగకు స్వంత గ్రామాలు చేరుకునే వారు కూడా ఎక్కువే. స్వంత గ్రామాలకు చేరుకునే వారికి గుంటలు లేని రోడ్లు గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు రోడ్ల రిపేర్లు పూర్తిచేయాలని సూచించారు. సంక్రాంతి సందర్బంగా వైకాపా సోషల్ మీడియా కించపరిచే పోస్టులు పెడుతుందని చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా సోషల్ మీడియా అలాంటి పోస్టులు పెడితే నియోజకవర్గ ఎమ్మెల్యే బాధ్యులవుతారని చంద్రబాబు హెచ్చరించారు. రోడ్లు బాగా లేవని వైకాపా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ప్రమాదముందన్నారు. వీటిని నిలువరించడానికి టిడిపి ఎమ్మెల్యేలు ముందుకు రావాలన్నారు. గుంతలు పడ్డ రోడ్ల రిపేర్ పూర్తి చేయాలని సూచించారు. నేను ఒకటే చెబుతున్నాను. తెలుగు దేశం పార్టీ సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపింది. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేసింది తెలుగుదేశం పార్టీ. సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేస్తే చూసూ ఊరుకునేది లేదని చంద్రబాబు వైకాపా నేతలను హెచ్చరించారు.