బిసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి..   కవిత కొత్తరాగం 

తీహార్ జైలు నుంచి కండిషన్ బెయిల్ మీద విడుదలైన బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో మారు తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగిత్యాల,నిజామాబాద్ జిల్లాల్లో తన పర్యటనలు అట్టర్ ప్లాప్ కావడంతో తాజాగా బీసీ నినాదం ఎత్తుకున్నారు. బతుకమ్మ ఈవెంట్ టార్గెట్ గా   ఏర్పాటైన జాగృతి సంస్థ  ఇపుడు బిసీ నినాదాన్ని ఎత్తుకుంది.    శుక్రవారం సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్బంగా బిఆర్ఎస్  పిలుపునిచ్చిన సభకు  తెలంగాణ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బిసీలు గుర్తుకురాని కవిత సడెన్ గా బిసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. 

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన బిఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా లేదు. ఈ ఎన్నికలను వాయిదావేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు మొదలుపెట్టింది.  జనాభాలో  సగభాగం ఉన్న బిసీలకు 42 శాతం రిజర్వేషన్ ఏమిటని ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ  గత ఎన్నికల సమయంలో బిసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని కాంగ్రెస్ పార్టీ మర్చిందని గుర్తు చేయడానికి స్థానికసంస్థల ఎన్నికల వేళ బిసీజెండాను ఎత్తుకుంది. బతుకమ్మ వేడుకలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జాగృతి సంస్థ బతుకమ్మ వేడుకలను పూర్తిగా గాలికొదిలేసింది.  కవిత తీహార్ జైలు నుంచి విడుదలయ్యాక  బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తారని అందరూ ఊహించారు. కానీ ఆ ఊసే లెకుండా బతుకమ్మ సంబరాలను స్కిప్ చేశారు. 

ఇపుడు తాజాగా బీసీ డెడికేషన్ కమీషన్  నివేదిక ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కవిత కొత్త రాగం అందుకున్నారు.  రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు జరగడానికి వీల్లేదని కవిత హుంకరిస్తున్నారు. అప్పట్లో లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నప్పుడు కూడా కవిత ఇదే విధంగా బిజెపితో బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడిపారు. పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేయడం తెలంగాణ ప్రజానీకానికి   ఇంకా గుర్తుండే ఉంటుంది. తీహార్ జైల్లో ఉన్నప్పుడు కోర్టు ట్రయల్స్ కు హాజరైన సమయంలో కూడా కవిత జై తెలంగాణా నినాదాన్ని ఎత్తుకున్నారు. ఈ వ్యాఖ్యల పట్ల న్యాయస్థానం కవితకు అక్షింతలు వేసింది . తెలంగాణ ఉద్యమానికి లిక్కర్ స్కాంకు ఉన్న సంబంధం ఏమిటో కవితనే సమాధానమిస్తే బాగుంటుంది. తెలంగాణా రాజకీయాల్లో మోస్ట్ వపర్ ఫుల్ పొలిటిషన్ అయిన కవిత కామెడీ స్టార్ గా మిగిలిపోయారు.