తల్లి అంత్యక్రియలు చేసిన రేణుకా చౌదరి...

 

కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి స్వయంగా తానే తన తల్లికి కర్మకాండలు నిర్వహించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రేణుకా చౌదరి తల్లి వసుంధర (84)  బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈరోజు మహాప్రస్థానంలో జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. వసుంధరకు ముగ్గురూ కుమార్తెలే ఉన్నారు. వీరిలో రేణుకా చౌదరి అందరికంటే పెద్దది కావడంతో.. ఆమెనే కర్మకాండలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు ఆమె కుటుంబసభ్యులతో పాటు, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu