చైనా మరో వార్నింగ్...
posted on Jul 6, 2017 3:46PM

భారత్-చైనా మధ్య వార్ రోజు రోజుకీ పెరుగిపోతుంది. చైనా అయితే ఓ అడుగు ముందుకేసి భారత్ కు వార్నింగ్ ల మీద వార్నింగులు ఇచ్చేస్తుంది. ఇప్పుడు తాజాగా సిక్కిం వేర్పాటు వాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. భారత్ వెనక్కి తగ్గకపోతే సిక్కిం వేర్పాటువాదులకు తాము మద్దతు ప్రకటిస్తామని, సహాయ సహకారాలను అందజేస్తామని చైనా అధికారిక మీడియా హెచ్చరించింది. సిక్కిం ప్రజలకు భారత్ నుంచి విముక్తి కలిగి వారు స్వాతంత్య్రం పొందాలి అంటూ అక్కడి ప్రజలకు స్వదేశంపై విద్వేషభావం కలిగించే ప్రయత్నం చేస్తోంది. 2003లో సిక్కింను భారత భూభాగంగా చైనా గుర్తించినప్పటికీ... అవసరమైతే ఇప్పుడు ఆ అంశాన్ని సవరిస్తామని... సిక్కింలోని ప్రజలు ప్రత్యేక దేశం కోరుకుంటున్నారు. వారికి ఈ దేశం తప్పకుండా మద్దతిస్తుంది’ అని తెలిపింది.