మరో సంచలనానికి జియో..
posted on Jul 5, 2017 11:39AM

భారతీయ టెలికాం మార్కెట్‌లో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. మొదట ఉచిత సర్వీసులు ఇచ్చిన జియో... ఇప్పుడు మరో సంచలనానికి నాంది పలకనుంది. ఇప్పుడు అతి చౌక ధరలో ఫోన్ ను అందిచనుంది. కేవలం రూ. 500లకే 4జీ ఫీచర్ ఫోన్ ను వినియోగదారులకు అందుబాటులోకి తేనునట్టు సమాచారం. 4జీ వోల్ట్ సపోర్ట్‌తో రిలయన్స్ జియో ఈ నెలలోనే ఈ ఫీచర్ ఫోన్‌ను ప్రారంభించనుంది. ఈ నెల(జూలై) 21 వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో ఈ ఫీచర్ ఫోన్‌ను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు త్వరలో ముగియనున్న ధన్ ధనా ధన్ ఆఫర్‌కు ధీటుగా మరో సరికొత్త టారిఫ్ ప్లాన్‌తో జియో కస్టమర్ల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హెచ్‌ఎస్‌బీసీ డైరెక్టర్, టెలికాం విశ్లేషకుడు రాజీవ్ శర్మ మాట్లాడుతూ... దీంతో టెలికం మార్కెట్లో మరో సంచనలం సృష్టించనుంది. అద్భుతమైన ఆఫర్, తక్కువ ధరలో ఫీచర్ ఫోన్ మేలు కలయికతో జియో మరోసారి వినియోగదారులకు ఆకట్టుకోనుందని అన్నారు.