అసెంబ్లీలో రగడ...ఇక్కడే చంపేస్తా అంటూ మంత్రి వ్యాఖ్యలు...


దేశ వ్యాప్తంగా ఒకే పన్ను ఉండాలన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బిల్లును అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ బిల్లుకు దేశ వ్యాప్తంగా మద్దతు లభించింది  కూడా. అయితే ఈ బిల్లుకు జమ్మూకశ్మీర్ మాత్రం మద్దతు తెలుపలేదు. దీంతో దేశ వ్యాప్తంగా జీఎస్టీ బిల్లు అమల్లోకి వచ్చినా జమ్మూకశ్మీర్ లో మాత్రం  జీఎస్టీ అమల్లోకి రాలేదు. ఇక దీనిపై అసెంబ్లీలో కూడా ఆందోళనలు మొదలయ్యాయి. అవి కాస్త వ్యక్తిగత బెదిరింపులకు దిగే పరిస్థితి వచ్చింది. జీఎస్టీ బిల్లుపై జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ నేత దేవేందర్ రాణా కొత్త పన్ను విధానం అమలు కాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకపన్ను విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే యత్నం చేశారు. తాను పన్నులు ఎగ్గొట్టలేదని, చీకటి వ్యాపారాలు చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అధికార పక్ష నేతలకు బదులిచ్చారు. ఓ వైపు ఎమ్మెల్యే రాణా మాట్లాడుతుండగా.. రాష్ట్ర ఐటీ, సాంకేతిక విద్య శాఖలమంత్రి ఇమ్రాన్ అన్సారీ కలుగజేసుకుని 'నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే చంపేయగలను. నీ దొంగ వ్యాపారాలు నాకు తెలుసు. రాష్ట్రంలో నీ కంటే పెద్ద దొంగ ఎవరూ లేరు. మోబిల్ ఆయిల్‌ అమ్ముతూ వ్యాపారాలు మొదలుపెట్టావ్. నీకు అన్ని ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయో మాకు తెలియదనుకున్నావా' అంటూ బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో అసెంబ్లీలో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. మంత్రిగారు చేసిన వ్యాఖ్యలకు ప్రతిపక్ష పార్టీ నేతలు తప్పుబడుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu