చంద్రబాబు గాలం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు...


ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఈ సామెత మనకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ సామెతనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇంతకీ చంద్రబాబు అంతలా ఈ సామెతను ఫాలో అవ్వడానికి గల కారణమెంటో తెలియాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. అసలు సంగతేంటంటే.. ప్రస్తుత టీటీడీ చైర్మన్ చదలవాడ శ్రీనివాస రావు పదవీ కాలం పూర్తి కావస్తోంది.  దీంతో ఏపీ సీఎం చంద్రబాబు ఈ పదవికోసం కొత్తవారిని ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దాదాపు కొన్నినెలల నుండే ఈపదవి గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ చర్చల్లో రాయపాటి సాంబశివరావు, మురళీమోహన్, బీదా మస్తాన్ రావు ఇలా చాలామంది పేర్లే తెరపైకి వచ్చాయి. ఇక రాయపాటి లాంటి వాళ్లైతే ఈ పదవి కోసం ఏకంగా ఎంపీ పదవినే వదలుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు పత్రికా ముఖంగా చెప్పినట్టు సమాచారాం. ఇక ఇన్ని తలనొప్పులకు చెక్ పెట్టేందుకుగాను.. పొలిటికల్ మైలేజ్ ను కూడా కాస్త పెంచేందుకు గాను చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల టాక్. అదేంటంటే.. తెలుగుదేశం పార్టీ స్థాపకుడు.. నందమూరి తారకరామారావు తనయుడైన హరికృష్ణ పేరు  ఆయన పరిశీలిస్తున్నారని అంటున్నారు.

 

హరికృష్ణ గత కొంత కాలంగా పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో హరికృష్ణను ఎలాగైన మచ్చిక చేసుకోవాలని ఆయన  సేవలను పార్టీకి వినియోగించాలని చంద్రబాబునాయుడు తనదైన శైలీలో వినియోగానికి సిద్దమైనట్లు తెలిసింది. అందుకే నందమూరి హరికృష్ణకు ఎంతో కీలకమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ పదవిని కట్టబెట్టేందుకు సుముఖంగా ఉన్నారనే ప్రచారం జోరందుకున్నది. అంతేకాదు హరికృష్ణ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కు గాలెం వేయాలని చూస్తున్నట్టు మరో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే రెండేళ్లలోపు ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తాయో.. ఏ పార్టీలు పొత్తుగా నిలుస్తాయో చెప్పలేని పరిస్థితి. ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ఈసారి నేరుగా ఎన్నికల రంగంలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన పొత్తు ఊహాజనకంగానే మారింది. దీంతో పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ ను తట్టుకోవాలంటే అందుకు జూనీయర్ ఎన్టీఆరే కరెక్ట్ అని.. అందుకే హరికృష్ణ ద్వారా.. జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించాలని చంద్రబాబు చూస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

 

అంతేకాదు బాలకృష్ణకు, హరికృష్ణకు మధ్య కూడా సరైన సఖ్యత లేదని అందరికి బహిరంగంగా తెలిసిన నిజమే. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు, బాలకృష్ణకు మధ్య ఉన్న కోల్డ్ వార్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనేంత వార్ నడుస్తుందని టాక్. అందుకే అటు బాలకృష్ణ, జూనియర్ మధ్య ఉన్న గొడవను కూడా కాస్త తగ్గించడానికి కూడా చంద్రబాబు ఈ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. అయితే ఇది పొలిటికల్ యాంగిల్ మాత్రమే.. కానీ దీని వెనుక మూవీ యాంగిల్ కూడా ఉందంటున్నారు పెద్దలు. త్వరలో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుండంతో ఇలాంటి టైంలో బాలకృష్ణ వర్గం... జూనియర్ ఎన్టీఆర్ వర్గం అంటూ రెండు వర్గాలుగా నందమూరి ఫ్యాన్స్ ఉంటే అది మోక్షజ్ఞ కెరీర్ కే నష్టమని.. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో ఉన్న చీలికలు, పీలికలే ఒక ఉదాహరణ అని... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ అంటూ అసలు మెగా ఫ్యామిలీ పునాదికి కారణమైన చిరంజీవి కొడుకు రాం చరణ్ పరిస్థితి ఎటు కాకుండా పోయిందని.. ఇలాంటి టైంలో అలాంటి చీలికలు లేకుండా.. కొడుకు కెరీర్ కోసం ఎన్టీఆర్ తో కలవడానికి బాలకృష్ణ కూడా దిగొచ్చి ఓకే చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్క హరికృష్ణను తెరపైకి తీసుకొస్తే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని... మన రాజకీయ చాణక్యుడు చంద్రబాబు చాలా లోతుగా ఆలోచించి.. టీటీడీ చైర్మన్‌ పదవిని హరికృష్ణకు ఇచ్చి.. నందమూరి కుటుంబాన్ని మరింతగా అక్కున చేర్చుకోవాలని..యోచిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో తెలియాలంటే కొంత సమయం వెయిట్ చేయాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu