శాస్త్రి గారి అడుగుజాడల్లో టీమిండియా
posted on Jul 11, 2017 5:47PM
.jpg)
అనిల్ కుంబ్లే తర్వాత టీమిండియా కోచ్ ఎవరవుతారా అని దేశవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ బుర్రలు గొక్కుంటున్నారు..గత కొద్ది కాలంగా జరుగుతున్న డ్రామాకు ఇవాళ్టీతో తెర పడింది. టీమిండియా చీఫ్ కోచ్‌గా అందరూ ఊహించినట్లుగానే భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రిని వరించింది. రవిశాస్త్రి కోచ్ రేసులోకి వచ్చినప్పుడే కొత్త గురువు అంటూ విరాట్ కోహ్లీ అన్నప్పుడే కొందరికి క్లూ దొరికినప్పటికీ ఇవాళ అది నిజమైంది. ఈ మేరకు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన బీసీసీఐ సలహా కమిటీ రవిశాస్త్రి పేరును సూచించగా..వెనువెంటనే ఆ ప్రతిపాదనకు బీసీసీఐ అధికారిక ముద్ర వేసింది. శ్రీలంక పర్యటనతో రవిశాస్త్రి తన బాధ్యతల్ని చేపట్టే అవకాశం ఉంది.