రమణదీక్షితుల రూపంలో అదృష్టం వరించింది.!!

అదృష్టం ఉంటే ఎప్పటికైనా మనకు కావాల్సింది వరిస్తుంది అంటారు.. తాజాగా, రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి రమణకుమార్‌కు విషయంలో ఇదే జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. అదృష్టం ఆయనకు రమణదీక్షితుల రూపంలో తగిలి, సమాచారహక్కు చట్టం కమీషనర్‌ పదవి దక్కిందని ప్రచారం జరుగుతోంది.

 

 


రమణ దీక్షితులు స్వామి వారి ఆభరణాలు, పింక్ డైమండ్ మిస్ అయ్యాయంటూ టీటీడీ మీద, టీడీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు, విమర్శలు చేసారు.. వెంటనే రంగంలోకి దిగిన రమణకుమార్, రమణదీక్షితుల ఆస్తులు, ఆయన వ్యవహారశైలి.. అప్పట్లో ఆయన సాంప్రదాయాలకు విరుద్దంగా ఎవరెవరి దగ్గరకు వెళ్లి ఏమేమి చేశారు?.. అప్పట్లో శ్రీవారి నగల పరిస్థితి ఎలా ఉందో అన్ని వివరాలను బాహాటంగా మీడియాకు తెలిపి.. చంద్రబాబు ప్రభుత్వం మీద రమణదీక్షితులు చేసిన విమర్శలను తిప్పికొట్టారు.. ఇదే రమణకుమార్ పాలిట వరంలా మారిందట.. ప్రభుత్వం మీద విమర్శలు రాకుండా కాపాడిన ఆయన సేవలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావించారని, అందుకే సమాచారహక్కు చట్టం కమీషనర్‌ పదవిని కట్టబెట్టారని ప్రచారం జరుగుతోంది.. మొత్తానికి రమణ కుమార్ కి, రమణ దీక్షితుల రూపంలో అదృష్టం వరించిందని చర్చ జరుగుతోంది.