మోడీ గురువు కన్నుమూత..తీవ్ర దిగ్భ్రాంతిలో ప్రధాని
posted on Jun 19, 2017 10:39AM
.jpg)
ప్రధాని నరేంద్రమోడీ ఆధ్మాత్మిక గురువు, రామకృష్ణమఠం అధ్యక్షులు ఆత్మస్థానందజీ మహారాజ్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన వయస్సు 98 సంవత్సరాలు..గత కొద్ది రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆత్మాస్థానందజీ మరణవార్తను తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనను రాజకీయాల్లోకి ప్రవేశించాలని దిశానిర్దేశం చేశారని..తన జీవితంలో అత్యంత కీలకదశలో స్వామిజీతో గడిపానని గుర్తు చేసుకున్నారు. తాను ఎప్పుడు కోల్‌కతా వెళ్లినా స్వామిజీని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకునేవాడినని మోడీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆత్మస్థానందజీ అంత్యక్రియలు ఇవాళ బేలూరు మఠంలో జరగనున్నాయి.