లండన్‌లో మళ్లీ బీభత్సం..

ఉగ్రవాదులు బ్రిటన్ రాజధాని లండన్‌పై పగబట్టినట్లున్నారు.. కొద్ది రోజుల క్రితం మాంచెస్టర్ బ్రిడ్జిపై ట్రక్కుతో పాదచారులను ఢీకొట్టిన ఘటన ఇంకా మరువక ముందే అచ్చం అలాంటి ఘాతుకానికే పాల్పడ్డారు. సెవెన్ సిస్టర్స్ రోడ్డులో గల ముస్లిం వెల్ఫేర్ బిల్డింగ్ దగ్గర అర్థరాత్రి ప్రార్థనలు ముగించుకుని వస్తున్న ముస్లిం సోదరులపైకి ట్రక్కు దూసుకొచ్చింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా లేక కుట్రకోణం దాగివుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో లండన్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu