ఉత్కంఠకు తెర... ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ఖరారు....
posted on Jun 19, 2017 3:11PM

ఇన్ని రోజుల ఉత్కంఠతకు తెరపడింది. బీజేపీ తమ పార్టీ తరపున రాష్ట్రపతి అభ్యర్ధిని ప్రకటించింది. వచ్చే నెలలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ చాలామంది పేర్లే తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పుడు వాటన్నిటికీ బ్రేక్ వేస్తూ.. ఎన్డీయే తమ అభ్యర్ధిని ప్రకటించింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా రామ్ నాథ్ కోవింద్ ను ఎంపిక చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రామ్ నాథ్ కోవింద్ ను ఎంపిక చేసినట్టు ప్రకటించారు. కాగా ప్రస్తుతం ఆయన బీహార్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. 12 ఏళ్ల పాటు ఆయన రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. నాలుగేళ్లపాటు బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అంతేకాదు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కూడా ఆయన న్యాయవాదిగా పని చేశారు.