అక్కడేం జరుగుతోంది?.. నాకు తెలియాలి!
posted on Dec 21, 2015 9:24PM

అయోధ్యలో ఏం జరుగుతోందో తనకు తెలియాలని యు.పి. ప్రభుత్వం ఇంటెలిజెన్స్.ను ఆదేశించింది. ఈ మేరకు రహస్య నివేదికను తనకు సమర్పించాలని కోరింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ఇటుకలు సేకరించాలని వీహెచ్‌పీ పిలుపు ఇచ్చిన ఆరు నెలల తర్వాత ఇటుకలతో కూడిన రెండు ట్రక్కులు అయోధ్యకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరుగుతోందో తమకు నివేదించాలని యు.పి. ప్రభుత్వం ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్‌ను కోరింది. అయోధ్యకు సమీపంలో వున్న రామ్‌సేవక్‌పురంలోని విశ్వహిందూ పరిషత్‌కి చెందిన స్థలంలో దించిన ఇటుకలకు రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ ఆధ్వర్యంలో పూజ నిర్వహించినట్టు వీహెచ్‌పీ అధికార ప్రతినిధి శరద్ శర్మ ఆదివారం నాడు ప్రకటించడం దేశవ్యాప్తంగా సంచలనం నృష్టించింది. రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ నుంచి సంకేతాలు కూడా అందినట్టు మహంత్ నృత్యగోపాల్ దాస్ చెప్పడం విశేషం.