మాగంటి బాబు గన్‌మన్ ఆత్మహత్య

 

ఏలూరు ఎంపీ మాగంటి బాబు వద్ద గన్‌మన్‌గా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ఎం.ఆదాం (44) సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు జె.వి.ఆర్. నగర్‌లో నివాసం వుంటున్న ఆదాం పురుగుల మందు తాగడం గమనించిన ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికత్స పొందుతూ ఆదాం మరణించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదాం ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆదాం ఆత్మహత్య పట్ల ఎంపీ మాగంటి బాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఢిల్లీలో వున్న ఆయన ఆదాం కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు. ఆదాంకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారు. ఆదాం భార్య మార్తమ్మ ఏలూరులో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu