పిచ్చికి పరాకాష్ట ఇదే...

 

మొన్నటి వరకూ టీడీపీ నేతలపై తన ప్రతాపాన్ని చూపించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కేతిరెడ్డి పై పడ్డాడు. దీనంతటికీ కారణం.. "కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి కూడా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని చెప్పడమే. ఇప్పటికే తాను ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నానని... అప్పటికప్పుడు ఓ పోస్టర్ ను... ఓ పాటను రికార్డ్ చేసి వదిలేశాడు వర్మ. ఇక పోస్టర్ లో ఓ మహిళ కాలు మాత్రమే కనిపించేలా ఉంటుంది. ఇక కేతిరెడ్డి కూడా తాను ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నాని ప్రకటించాడో లేదో... దానికి సంబంధించి ఓ పోస్టర్ ను విడుదల చేశాడు. అందులో ఓ మహిళ వెనుక వైపు నుండి తన వీపును చూపిస్తుంది. అంతే.. ఇక వర్మ తన ప్రతాపాన్ని చూపించాడు. ఇక ఈ పోస్టర్ లో కనిపిస్తున్న యువతి బ్యాక్ చాలా బాగుందని అన్నాడు. అంతేకాదు అక్కడితో ఆగకుండా.. "కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డికి తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ కన్నా 100 రెట్లు ఎక్కువ ఎక్స్ ట్రార్డినరీ స్క్రీన్ ప్రెజన్స్ వుంది... కేతి రెడ్డిని చూసాడంటే మహేష్ బాబు కూడా కుళ్ళు తో చచ్చిపోతాడు అన్నాడు. ఇంకా 'లక్ష్మిస్ వీరగ్రంథం'లో వీరగంధం పాత్ర తను వేస్తే బ్లాక్ బస్టర్ గ్యారంటీ. కేతిరెడ్డి హీరోగా వీరగంధం పాత్ర మరియు హీరోయిన్ గా ఒక సెక్సీ వీపు. వావ్!! సూపరో సూపరు. నందమూరి తారకరామారావు గారు స్వర్గం నుంచి ఒక లారీ లోడ్ అక్షింతలు కేతిరెడ్డి నెత్తి మీద చల్లడం ఖాయం" అని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించాడు. అంతేకాదు ఆ నటి వీపుపై తన ఫొటోతో పాటు మహేష్ బాబు, కేసీఆర్, ఎన్టీఆర్, కేతిరెడ్డి ఫొటోలు పెట్టి అదే పోస్టర్ ను రీ ట్వీట్ చేశాడు. మొత్తానికి వర్మ తన పిచ్చితో సంబంధం లేని వాళ్లను కూడా దీనిలోకి లాగుతున్నాడు. మరి వర్మ పెట్టిన ఈ ఫొటోను చూసి మహేశ్ బాబు ఫ్యాన్స్ ఊరుకుంటారా..? కేసీఆర్ అభిమానులు ఊరుకుంటారా..? చూద్దాం ఏం జరుగుతుందో....

Online Jyotish
Tone Academy
KidsOne Telugu