పోతూ పోతూ ఊడ్చేస్తున్నాడుగా..
posted on Oct 30, 2017 3:49PM
.jpg)
రేవంత్ రెడ్డి రేపో..మాపో కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఖాయం. టీడీపీ పార్టీకి పెద్ద షాకిస్తూ రేవంత్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ నేతల తీరు తనకి బాధని కలిగించిందని రాజీనామా లేఖలో రాశాడు. అందుకే రాజీమానా చేస్తున్నానని చంద్రబాబుకు తెలిపారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నారేవంత్ రెడ్డి ఎగ్జిట్ తరువాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటి... టీడీపీ పని అయిపోయినట్టే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పోతూ పోతూ టీడీపీ మొత్తాన్ని ఖాళీ చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నాడు అన్నవార్తలు వచ్చిన వెంటనే కొంతమంది టీడీపీ నేతలు టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీ నుండి జంప్ అవ్వడంతో ఇప్పుడు కాస్తో కూస్తో మిగిలిపోయి నేతలు కూడా రేవంత్ వెంట వెళ్లనున్నట్టు రాజకీయ వర్గాల టాక్. వారిలో కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మానకొండూర్ నియోజకవర్గ ఇన్ చార్జ్ కవ్వంపల్లి సత్యనారాయణ, పులి రాంబాబు, ముప్పిడి శ్రీధర్, ముంజ ఉమేందర్ గౌడ్, నందిపేట రమణయాదవ్, చింతలకోటి రామస్వామి తదితరులు రేవంత్ వెంట వెళ్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతక్క, బోడ జనార్దన్, అరికెల నర్సారెడ్డి, సోయం బాపూరావు, భూపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తెలుస్తోంది. రేవంత్ తో పాటు కాంగ్రెస్ లో చేరే విషయమై నల్గొండ జిల్లా ముఖ్య నేత, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి తన కార్యకర్తలతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటివరకూ టీడీపీకి ఫైర్ బ్రాండ్ గా ఉన్నరేవంత్ రెడ్డి పార్టీ మారుతుండటంతో.. మిగిలిన నేతలు కూడా రేవంత్ దారి పడుతున్నారు. దీంతో పోతూ పోతూ రేవంత్ టీడీపీని ఊడ్చేస్తున్నట్టు తెలుస్తోంది.