జవాన్లకు అక్షయ్ కుమార్ సాయం.. ప్రశంసల జల్లు

 

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన దాడిలో 12 మంది జవాన్లు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చనిపోయిన జవాన్ల కుటుంబాలకు సహాయం చేసి తన దాతృత్వాన్ని మరోసారి నిరూపించాడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఒక్కో కుటుంబానికి రూ. 9 లక్షల వంతున అక్షయ్ అందజేశాడు. దీంతో అక్షయ్ చేసిన సహాయానికి గాను ప్రతిఒక్కరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇంకా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అయితే అక్షయ్ ను పొగడ్తలతో ముంచెత్తారు. అక్షయ్ చేసిన సాయం అమర జవాన్ల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ సహాయం ద్వారా అక్షయ్ ఎంతో మందికి ప్రేరణగా నిలిచారని..దేశంపై అక్షయ్ కు ఉన్న ప్రేమాభిమానాలను ఈ ఉదంతం వెల్లడిస్తోందదని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu