ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలీంగ్ షురూ...
posted on Mar 17, 2017 10:44AM

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మూడు స్ఠానిక ఎమ్మెల్సీ స్థానాలకు గాను పోలీంగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నిర్వహించనున్నారు. దీనిలో భాగంగానే పోలీంగ్ కేంద్రాలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా వైఎస్‌ఆర్, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. వైఎస్‌ఆర్‌జిల్లా నుండి 841మంది.. నెల్లూరు నుండి 852మంది.. కర్నూలు నుండి1083 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మరోవైపు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...జమ్మలమడుగులో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ఆయన పులివెందుల చేరుకున్నారు.