తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల పాటు వర్షాలే వర్షాలు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం   ఉత్తర దిశగా కదులుతోంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ సమాచారం మేరకు ఈ అల్పపీడన ప్రభావం తమళనాడు వరకూ ఉంటుంది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో గురువారం (ఏప్రిల్ 10) నుంచి వాతావరణం 12వ తేదీ వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  వర్షాలకు తోడు తీవ్రమైన గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఇక తెలంగాణలో అయితే తెలంగాణలో క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో గురువారం (ఏప్రిల్ 10) ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్‌, పాలమూరు, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu