గోవా బీజేపీ సీఎంతో రాహుల్ భేటీ

 

గోవా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను కలిశారు. ఈ రోజు ఉదయం పనాజీలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లిన రాహుల్‌.. సీఎం పారికర్‌తో సమావేశమయ్యారు.. రాఫెల్ వ్యవహారంపై ట్వీట్ పెట్టిన 24 గంటల్లోనే రాహుల్ పారికర్ ని కలవటం చర్చనీయాంశం అయింది. నిన్న రాహుల్ ట్విట్టర్ లో "రాఫెల్ వ్యవహారంనికి సంబంధించి ఆడియో టేప్స్ బయటకి వచ్చి నేటికీ 30 రోజులు అయ్యాయి. కానీ ఇప్పటికీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటంగాని ఎంక్వేయిరీకి ఆదేశించటంగాని జరగలేదు. ఆ మంత్రి పై ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించి ఫైల్‌ పారికర్‌ వద్ద ఉంది కాబట్టే ప్రధాని మోడీపై పైచేయి సాధించి గోవా సీఎంగా కొనసాగుతున్నారు" అని ట్వీట్ చేశారు. గతంలో గోవా మంత్రి ఒకరు "‘రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాలు తన బెడ్ రూంలో ఉన్నాయని మంత్రివర్గ సమావేశం సందర్భంగా పారికర్‌ అన్నారు’’ అని వ్యాఖ్యలు చేసిన ఆడియో టేప్స్ ని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ తాజాగా ట్వీట్ పెట్టటం, పారికర్ ని కలవటం సర్వత్రా ఉత్కంఠ రేపింది. అయితే పారికర్ తో సమావేశమవ్వటానికి కారణాన్ని రాహుల్ మరో ట్వీట్ లో తెలియజేశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో భాదపడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆయనని పరామర్శించేందుకు వెళ్లినట్లు ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. ఆయన తొందరగా కోలుకోవాలని పేర్కొన్నారు.