కోహ్లీని మాకు ఇచ్చేయండి...

 

ప్రస్తుతం టీమిండియా జట్టులో మంచి ఫాంలో ఉన్న ఆటగాడు ఎవరంటే కోహ్లీ అని ఎవరైనా టక్కున చెప్పేస్తారు. ఆటగాడిగానే కాదు..కెప్టెన్ గా కూడా తన సత్తా ఏంటో చూపించాడు. మన దేశమే కాదు.. విదేశీ ఆటగాళ్లు కూడా కోహ్లీ పై ప్రశంసలు కురిపిస్తారంటే.. అతని ఆట తీరు ఏంటో చెప్పొచ్చు. ఇప్పుడు పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ కు చెందిన జర్నలిస్టు నజరానా గఫర్ కోహ్లీని పొగుడుతూ ఓ ట్వీట్ చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడిని మాకు ఇచ్చేయండి...అందుకు ప్రతిగా మొత్తం పాకిస్థాన్ జట్టునే తీసుకోండి అంటూ సరికొత్త ప్రతిపాదన చేశాడు. ఈ ట్వీట్ పాకిస్థానీలను ఆకట్టుకుంది. ఇక దీనిపై ఒకటే రీట్వీట్లు.. కౌంటర్లు మొదలయ్యాయి. దయచేసి గాడిదలను గుర్రాలతో పోల్చవద్దని.. పాక్ క్రికెటర్లు మరో రెండు తరాలైనా టీమిండియాకు సాటిరారు అని స్పష్టం చేశారు. అప్పుడు కశ్మీర్ కావాలన్నారు...ఇప్పుడు కోహ్లీ కావాలంటున్నారు...కానీ పాక్ కి ఎప్పటికీ 'కే' సొంతం కాదు అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. మరి దీనిపై ఇంకెన్ని కౌంటర్లు, రీ కౌంటర్లు వస్తాయో చూద్దాం..

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu