రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలి..
posted on Aug 25, 2016 6:10PM
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మహాత్మాగాంధీ హత్య విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతితెలిసిందే. దీనిపై గత కొద్ది రోజులుగా రచ్చ జరుగుతూనే ఉంది. అంతేకాదు దీనిపై ఆర్‌ఎస్‌ఎస్ కోర్టును కూడా ఆశ్రయించింది. దీనిపై రాహుల్ బుధవారం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. మహత్మాగాంధీని హత్య చేసిన సంస్థగా ఆర్‌ఎస్‌ఎస్‌ను తానెప్పుడూ నిందించలేదని, ఆ సంస్థతో అనుబంధం ఉన్న వ్యక్తి గాంధీ హత్యకు బాధ్యుడని మాత్రమే చెప్పానని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్ సంస్థకు చెందిన ప్రముఖ నేత ఎంజీ వైద్య అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుగా ఒప్పుకొని, క్షమాపణ చెప్పాలని ‘ఆర్‌ఎస్‌ఎస్ మొత్తాన్ని తాను నిందించలేదని, సంస్థకు అనుబంధం ఓ వ్యక్తి బాధ్యుడని ఇప్పుడు రాహుల్ చెప్తున్నారు.. అయితే ఆ వ్యక్తికి ఆర్‌ఎస్‌ఎస్‌తో ఎలా సంబంధం ఉంది, సంస్థలో ఎలాంటి బాధ్యతలు చేపడుతున్నాడో రాహుల్ స్పష్టత ఇవ్వాలని అన్నారు. మరి రాహుల్ గాంధీ క్షమాపణ చెబుతారో లేదో చూడాలి.