పుట్టపర్తికి సచిన్
posted on Apr 24, 2011 2:15PM
హైదరాబాద్: భగవాన్ శ్రీ
సత్యసాయిబాబా పార్థివ శరీరాన్ని దర్శించుకోవడానికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సోమవారం పుట్టపర్తికి వెళ్లనున్నట్టు సమాచారం. సచిన్ టెండుల్కర్ సత్యసాయికి పరమ భక్తుడు అని తెలిసిందే. బాబా మరణ వార్త విని సచిన్ టెండుల్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం దక్కన్ చార్జర్స్‌తో ఆడనున్న ఆటను బాబాకే అంకితం ఇస్తున్నట్టు సచిన్ చెప్పారు. ఈ ఆటలో తాను సెంచరీ చేసినా దానిని బాబాకే అంకితమిస్తానని చెప్పారు. కాగా ఆదివారం దక్కన్ చార్జర్స్‌తో మ్యాచ్ ఉన్నందునే సచిన్ వెళ్లలేక పోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బాబా ఆరోగ్యం బాగులేనందున తాను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్నట్టు శనివారం సచిన్ చెప్పారు. ఇప్పుడు బాబా మరణవార్త విని సచిన్ మరింత కలత చెందారు. శనివారం సాయంత్రం సతీమణి అంజలితో సచిన్ హైదరాబాదుకు వచ్చిన విషయం తెలిసిందే.