ప్రధాని సహా పలువురు సంతాపం
posted on Apr 24, 2011 3:04PM
హైదరాబాద్: సత్య
సాయి మృతిపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, సీనియర్ బీజేపీ నాయకులు అద్వానీ, జయలలిత, కర్ణాటక ముఖ్యమంత్రి యాడ్యురప్పలతోపాటు పలువురు ప్రముఖుల తమ సంతాపాన్ని వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. నీతివంతమైన, అర్ధవంతమైన జీవితానికి స్పూర్తినిచ్చిన గొప్ప అధ్యాత్మికవేత్త అని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. మానవ విలువలకు నిలువుటద్దం..అనేక విద్యాసంస్థలు, ఆరోగ్య సంస్థల ద్వారా ప్రజల సేవకు అంకితమయ్యారన్నారు. అధునిక కాలంలో స్వామి రామకృష్ట పరమహంస, స్వామి వివేకానంద, స్వామి దయానంద, మహాత్మగాంధి దేశానికి ఆదర్శవంతులుగా నిలిచిపోయారు.. ప్రస్తుత భారతంలో ఆధ్యాత్మిక రంగంలో సత్యసాయి విభిన్న వ్యక్తి అని బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ అన్నారు. అసంఖ్యాక విద్యాసంస్థలు, ఆస్పత్రుల ఏర్పాటు ద్వారా సుమారు ఐదు దశాబ్దలపాటు సేవలందించారని ఏఐడీఎంకే అధినేత్రి జయలలిత అన్నారు. ఆయన మృతి మానవ లోకానికి తీరని లోటన్నారు. మానవ లోకం కోసం సర్వం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి బాబా అని కర్నాటక ముఖ్యమంత్రి యాడ్యురప్ప అన్నారు.
కాగా, భక్తులు, ప్రజల దర్శనార్ధం సత్యసాయి పార్ధీవ శరీరాన్ని ప్రశాంతి నిలయానికి తరలించారు. ప్రత్యేకం అలంకరించిన వాహనంలో బాబా మృతదేహాన్ని ఉంచి భద్రతా ఏర్పాట్ల మధ్య నిలయానికి తీసుకువెళ్లారు.