పూరి జగన్నాథ్ చెంప పగలగొడ్తా...
posted on Jan 24, 2015 10:02AM

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనకు ఎప్పుడైనా ఎదురైతే అతని చెంప పగులగొడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓ.ఎస్.డి.), గాయకుడు దేశపతి శ్రీనివాస్ తన మనోభావాన్ని వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఒక కళాశాలలో శుక్రవారం నాడు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజాన్ని ఉద్ధరించడానికి సినిమాలు తీస్తే చంకనాకిపోతాయని పూరి జగన్నాథ్ ఈమధ్య అన్నారని, అలాంటి మాటలు మాట్లాడినందుకు దర్శకుడు పూరి జగన్నాథ్ చెంపను ఛెళ్ళుమనిపించాలని తనకు వుందని అన్నారు. సీమాంధ్రకు చెందిన కొందరు దర్శకులు స్త్రీలను, ఉపాధ్యాయులను, తండ్రులను అవమానిస్తూ బలాదూర్ కల్చర్‌ని తెస్తున్నారని దేశపతి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.