‘డ్యామ్’ఇట్.. కథ అడ్డం తిరిగింది..
posted on Jan 24, 2015 10:40AM

నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి నీటి విడుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరిస్తోంది కాబట్టి, డ్యామ్‌కి సంబంధించిన తమ వాటా భాగం నిర్వహణను తాము చూసుకుంటామని, 13 గేట్లకు సంబంధించిన వ్యవహారాలను తామే నడుపుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్యామ్ అధికారులకు లేఖ రాసింది. ఈ విషయాన్ని డ్యామ్ అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళారు. దాంతో ఇప్పటి వరకూ నాగార్జున సాగర్ డ్యామ్ విషయంలో తమ పట్టును సాధించుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ నాయకులు డామిట్.. కథ అడ్డం తిరిగిందని అనుకుంటున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ నిర్వహణ తాము కూడా చూస్తామని అంటే, పై నుంచి చుక్క నీరు కూడా నాగార్జున సాగర్‌లోకి రానివ్వమని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అయితే డ్యామ్ నిర్వహణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేట్టు కనిపించకపోవడంతో మేటర్ చాలా సీరియస్‌గా మారుతోంది.