రైతుల కోసం మరో ఉద్యమం: కోదండరాం

 

రైతుల్లో ఆత్మస్థైర్యం కలిగించి, ఆత్మహత్యలు నివారించడానికి తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రజాస్వామ్యయుతంగా మరో ఉద్యమాన్ని నిర్మిద్దామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాల నేపథ్యంలో ఎన్నో శక్తులు దాడి చేస్తూ రైతులను చిదిమేస్తున్న దృష్ట్యా అన్ని వర్గాల రైతులు సంఘటితం కావాలని కోరారు. నూతన ఆర్థిక సరళీకరణ విధానాలు అమల్లోకి వచ్చినతర్వాతే వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. గిట్టుబాటు ధర లభించక అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.