కత్రినాని ఓడించిన ప్రియాంక

 

బాలీవుడ్ హాట్ స్టార్ కత్రినా కైఫ్‌ని మరో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓడించేసింది. ప్రపంచ ఆసియా శృంగార దేవత (వరల్డ్ సెక్సీయస్ట్ ఆసియన్ వుమెన్)గా ఎంపికయ్యే విషయంలో కత్రినా కైఫ్‌ని పక్కకి నెట్టేసి ఆ స్థానాన్ని ప్రియాంక చోప్రా సొంతం చేసుకుంది. గురువారం నాడు లండన్‌లో ఈ పోటీ జరిగింది. ఈ పోటీలో గత ఏడాది విజేత కత్రినా కైఫ్‌ని కాదని ప్రియాంక చోప్రాను ‘వరల్డ్ సెక్సీయస్ట్ ఆసియన్ ఉమన్’ కిరీటం వరించింది. ఈ పోటీలో కత్రినా కైఫ్‌తోపాటు మరో యాభై మంది అందగత్తెను ప్రియాంక ఓడించింది. ఈ పోటీలో పాపులర్ టీవీ నటి ద్రస్థి ధమి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. గత ఏడాది నంబర్ వన్ కత్రినా ఈ ఏడాది నాలుగో స్థానాన్ని పొందింది.