150 మంది ఖైదీలు పరార్..


దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని జైలుపై జరిపిన దాడుల్లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 150 మంది ఖైదీలు పరారయ్యారు. వివరాల ప్రకారం...దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిందనావో ద్వీపంలోని నార్త్‌ కొటబాటొ జిల్లా జైల్లో  పెద్ద సంఖ్యలో సాయుధులు చుట్టుముట్టి గార్డులు, భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. మొత్తం 1500 మంది ఖైదీలు ఉండగా అందులో 150 మంది ఖైదీలు పారిపోయారు. అయితే ఈ కాల్పుల్లో ఒక గార్డు ప్రాణాలు కోల్పోగా.. మరో ఖైదీ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మరోవైపు దాడికి పాల్పడిన సాయుధులు ఐఎస్‌ ఉగ్రవాద సంస్థకు చెందినవారుగా అధికారులు భావిస్తున్నారు. జైలులో ఉన్న ఇస్లామిస్ట్‌ తీవ్రవాదులను విడిపించుకోవడం కోసమే ఈ దాడి జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌లో గత దశాబ్ద కాలంలో జైళ్లపై దాడిచేసి ఖైదీలను విడిపించుకున్న ఘటనల్లో ఇది మూడో అతి పెద్ద ఘటన.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu