ప్రశాంతమైన జీవితానికి పది సూత్రాలు..

ఈకాలంలో డబ్బు అయితే ఈజీగా సంపాదించగలుగుతున్నారు కానీ ప్రశాంతతను సంపాదించుకోలేకపోతున్నారు. ప్రశాంతత లేనిదే సంతోషాలుండవు.  ఒకవేళ జీవితంలో సంతోష క్షణాలు వచ్చినా అవి దీర్ఘకాలం ఉండవు. సంతోషాలు జీవితంలో ఉన్నా వాటిని అనుభూతి చెందలేరు. అందుకే ఎవరు చూసినా జీవితంలో ప్రశాంతత కరువైందని అంటూ ఉంటారు. కానీ ప్రశాంతత కావాలంటే జీవితంలో కొన్ని మార్పులు, కొన్ని నిజాలు, కొంత అవగాహన చాలా ముఖ్యం. ప్రశాంతమైన జీవితం సొంతం కావాలంటే ఈ కింది పది సూత్రాలను తూ.చా తప్పకుండా పాటించాలి.  అప్పుడు ప్రశాంతత కరువైందిరా బాబూ.. అని గోడు వెళ్లబోసుకోనక్కర్లేదు. ఇంతకీ ఆ సూత్రాలేంటో చూస్తే..

నేనేదీ ప్లానింగ్ చేసుకోను, దాని వల్ల ఒత్తిడి పెరుగుతుంది అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ నిజానికి నేటికాలంలో వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని, చిన్న చిన్న సంతోషాలను బ్యాలెన్స్ చేసుకోవాలంటే ప్లానింగ్ ముఖ్యం. ఉదయం నుండి రాత్రి వరకు ఆఫీసు పని నుండి ఇంట్లో పనుల వరకు.. ప్రణాళికా బద్దంగా పూర్తీ చేస్తుంది ఎప్పటి పని అప్పుడు కంప్లీట్ అయిపోయి మిగిలిన కొద్దో గొప్పో సమయం మీద ప్రభావం ఉండదు.

 లోతుగా చేసే శ్వాస వ్యాయామాలు ఒత్తిడి  మీద మంత్రంలా పనిచేస్తాయి. ప్రతిరోజూ వీటిని ఫాలో అవుతుంటే చాలు ఏ పని చేయాలన్నా కంగారు, హడావిడి లేకుండా చెయ్యగలుగుతారు. శ్వాస వ్యాయామాల పుణ్యం  మంచి ప్రశాంతత చేకూరుతుంది.

కేవలం శ్వాస వ్యాయామాలే కాదు శారీరక వ్యాయామాలు కూడా అవసరం. శారీరక వ్యాయామం వల్ల శరీరంలో ఎండార్పిన్ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.  ఇప్పట్లో శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలు ఏమీ లేవు, దీని కారణంగా చాలా తొందరగా శరీరాలు బలహీనం అవుతున్నాయి. హార్మోన్ల స్థితిలో మార్పు,  అవయవాల సామర్థ్యం తగ్గడం జరుగుతున్నాయి. అందుకే ప్రతిరోజూ కనీసం 30 నుండి 60 నిమిషాల వ్యాయామం చెయ్యాలి.

ధ్యానం మనిషిని అంతర్గతంగా రిపేర్ చేస్తుంది. మనసు నుండి శరీర అవయవాల వరకు ధ్యానం చేకూర్చే మేలు అంతా ఇంతా కాదు. గుండె ఆరోగ్యం, మానసిక ఒత్తిడి మొదలైన వాటిపై ప్రభావవంతంగా ఉంటుంది. మనసును నియంత్రిస్తుంది. తద్వారా ప్రశాంతత చేకూరుస్తుంది.

మనిషి ప్రశాంతతలో నిద్ర కూడా కీలకమైనది. చక్కని నిద్ర మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.  ప్రతిరోజూ కనీసం 7-8 గంటల మంచి నిద్ర బోలెడు రోగాలను దూరం చేస్తుంది. మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.

చాలామంది ఒత్తిడిగా ఉన్నప్పుడు, పనులు చకచకా జరగాలన్నా కాఫీ, టీ తాగి చురుగ్గా మారతారు. కానీ ఇవి తాత్కాలికంగా ఒత్తిడిని తగ్గిచ్చినట్టు అనిపిస్తాయి కానీ వీటిలో కెఫిన్ మానసిక సమస్యలు పెంచుతుంది. కాఫీ టీ బదులు, లెమన్ టీ, గ్రీన్ టీ, అల్లం, మరీ ముఖ్యంగా హెర్బల్ టీలు ప్రశాంతతను చేకూరుస్తాయి.

చాలామంది ఎమోషన్ గా ఉంటుంటారు. కానీ ఎమోషన్స్ పెంచుకోవడం జీవితంలో దుఃఖానికి కారణం అవుతుంది. ఆర్థిక నష్టాలు అయినా, వ్యక్తిగత విషయాలు అయినా నిరాశ పరిస్తే వాటిని ఒక అనుభవంగా తీసుకోవాలి. ఇలాంటి వారు దాదాపుగా బ్యాలెన్స్డ్ గా ఉంటారు.

ఆఫీస్ లో ఎంతో బాగా పనిచేస్తున్నాం కానీ గుర్తింపు లేదు, ఇంట్లో అందరి విషయంలో బాధ్యతగా ఉంటున్నాం కానీ గౌరవించరు. అందరికీ సాయం చేస్తుంటారు కానీ ఎవరూ పొగడరు. అందరితో మంచిగా ప్రేమగా ఉంటాం కానీ ఎవరూ మనల్ని తిరిగి అలా ట్రీట్ చేయరు. చాలామంది జీవితాల్లో జరిగేవి ఇవి.  జీవితం గురించి  అర్థం చేసుకునేవారు వీటిని పట్టించుకోరు. ఇతరుల నుండి ఏమీ ఆశించరు. కానీ కొందరు మాత్రం ప్రతి పని నుండి గుర్తింపో, ఆర్థిక లాభమో ఆశిస్తారు. ఇలాంటి వారే ప్రశాంతతకు దూరం అవుతారు.

ఆఫీసు పనులు, ఇంటి పనులు, ఇతర బాధ్యతలు అన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని అనుకుంటున్నారా? ఎప్పుడూ పనులు, బాధ్యతలే కాదు. విశ్రాంతి కూడా కావాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలి. ఇంకా ఎక్కువ ప్రశాంతత కావాలంటే ఒంటరిగా ఎక్కడికైనా ప్రయాణం చేస్తుండాలి. అది మానసికంగా చాలా మంచి ఊరట ఇస్తుంది.

వంట, సంగీతం వినడం, డ్యాన్స్, పుస్తకాలు చదవడం, ఆర్ట్స్, విభిన్న కళలుంటే వాటిని కంటిన్యూ చేయడం. కొత్త విషయాలు నేర్చుకోవడం ఇలా ఏదో ఒక అదనపు వ్యాపకం ఉండాలి. ఇవి ఒత్తిడి తగ్గించి ఉల్లాసాన్ని పెంచుతాయి.

                                *నిశ్శబ్ద.
 

Related Segment News