చిన్నారి లేఖకు స్పందించిన మోడీ

తనకు వైద్యం చేయించాలని ఒక చిన్నారి సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసింది. మహారాష్ట్రలోని పుణె నగరానికి చెందిన ఆరేళ్ల చిన్నారి వైశాలి యాదవ్‌కు గుండెలో రంధ్రం ఉండి..అనారోగ్యంతో బాధపడుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్తే సర్జరీ చేయాలన్నారు డాక్టర్లు..కాని అంత స్థోమత ఆ కుటుంబానికి లేదు. దీంతో విషయాన్ని ప్రధానమంత్రికి తెలియజేస్తానని వైశాలి తన తండ్రిని అడిగింది.

 

దీనికి ఆయన ఒప్పుకోవడంతో అప్పటికప్పుడే నోట్‌బుక్‌లో నుంచి ఒక పేజీ చించి తన అనారోగ్యం, పేదరికం గురించి ప్రధానమంత్రికి లేఖ రాసింది. ఖచ్చితమైన అడ్రస్ లేకపోవడంతో తన స్కూల్ ఐడీ కార్డును జత చేసింది. అయిదంటే ఐదు రోజుల్లో స్పందించిన మోడీ చిన్నారికి ఆపరేషన్ చేయించాలని జిల్లా కలెక్ట్రర్‌ను ఆదేశించారు. అలాగే పుణెలోని రూబీ హాల్ క్లినిక్‌‌కు నేరుగా పీఎంవో నుంచి లేఖ వచ్చింది. అటు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు, ఆసుపత్రి ప్రతినిధులు బాలిక వద్దకు చేరుకోవడానికి ఎలాంటి సదుపాయం రావడంతో పాఠశాలలో ఎంక్వైరీ చేసి బాలికను కలుసుకున్నారు. ఈ వారమే విజయవంతంగా ఆపరేషన్ కూడా నిర్వహించారు. తన లేఖకు సాక్షాత్తూ దేశ ప్రధాని స్పందించడంతో ఆ చిన్నారి ఆనందం వ్యక్తం చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu