చంద్రబాబు, కేసీఆర్ కు మోడీ ఫోన్... మమతా బెనర్జీ సంగతేంటీ...?
posted on Jun 19, 2017 4:15PM
.jpg)
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిని బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రామ్‌నాథ్ కోవింద్ ను ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో మోడీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేసినట్టు సమాచారం. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ ను ఎంపిక చేశామని.. ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని మోడీ ఇద్దరు సీఎంలను కోరినట్టు తెలుస్తోంది. ఇక ఇందుకుగాను చంద్రబాబు, కేసీఆర్ తమ మద్దతు తెలిపినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు కూడా కూడగట్టాలని చంద్రబాబును ప్రధాని కోరినట్టు తెలుస్తంది. దీనికి విదేశాల నుంచి మమతా బెనర్జీ రాగానే ఆమెను సంప్రదిస్తానని ప్రధానికి చంద్రబాబు తెలిపినట్టు సమాచారం.