హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
posted on Dec 17, 2025 3:25PM

శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్ శిక్షణ కేంద్రానికి ప్రత్యేక విమానం ద్వారా చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క తదితరులు స్వాగతం పలికారు. డిసెంబర్ 17 నుంచి 22 వరకు మొత్తం 5 రోజులు పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు.
18న రాష్ట్రపతి నిలయంలో విశ్రాంతి తీసుకుంటారు. 19న రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతారు. 20న గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్ శాంతిసరోవర్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటారు. 21న నిలయంలో నిర్వహించే పౌరుల భేటీ, ఎట్ హోమ్‌లో పాల్గొంటారు. 22న సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాష్ట్రపతి ముర్ము వెళ్లనున్నారు