డీలిమిటేషన్‌పై అభ్యంతరాల గడువు పెంపు
posted on Dec 17, 2025 7:04PM
.webp)
జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌పై అభ్యంతరల గడువు మరో రెండు రోజులు (డిసెంబర్ 19 వరకు) పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫీకేషన్‌పై దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వార్డుల వారీగా జనాభా సంఖ్యతో పాటు మ్యాప్‌లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని జీహెచ్‌ఎంసీకి కోర్టు ఆదేశించింది.
పిటిషనర్ పునర్విభజనపై సమాచారం అందించలేదని జనాభ, సరిహద్దులను పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.సెన్సస్ కమిషనర్ ఇచ్చిన డిసెంబర్ 31 డెడ్‌లైన్ గురించి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. గ్రేటర్ పరిధిని విస్తరించి 150 నుంచి 300 వార్డులకు పెంచుతూ డిసెంబర్ 9న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయింది.దీనిపై వెల్లువలా అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి