మోడీ మీరు నిజంగా హ్యాపీగా ఉన్నారా..?
posted on Dec 18, 2017 4:57PM
.jpg)
నటుడు ప్రకాశ్ రాజ్ ఈ మధ్య తరచూ మోడీ ప్రభుత్వంపై, మోడీపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రముఖ జర్నలిస్ట్ జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్య నేపథ్యలో మోడీని ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్...అప్పుడప్పుడు మోడీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా.. గుజరాత్ ఎన్నికల ఫలితాలపై కూడా స్పందించిన ప్రకాశ్ రాజ్.. మోడీ ని ప్రశ్నించారు. ప్రియమైన ప్రధాని గారికి … విజయంసాధించినందుకు శుభాకాంక్షలు అంటూనే … మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా అని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. 150కి పైగా సీట్లు సాధిస్తామని ప్రధాని చెప్పారని, మరి అన్ని స్థానాల్లో ఎందుకు గెలవలేకపోయామో ఒకసారి పునరాలోచించుకోవాలని ప్రకాశ్ రాజ్ సూచించారు. సమస్యలు ఎక్కడున్నాయో, వాటిని ఎలా పరిష్కరించాలో తెలుసుకోవాలన్నారు. విభజన రాజకీయాలు పనిచేయలేదని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను, పేదలను, రైతులను మోడీ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంచేసిన వారి గొంతు ఈ ఎన్నికల్లో వినిపిస్తోందని, మీరు వింటున్నారా… అని ఆయన ట్వీట్ చేశారు.
ప్రకాశ్ రాజ్ మాత్రమే కాదు.. అందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. చాలా కష్టంగా బీజేపీ గెలిచిందని... కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గట్టి పోటీనే ఇచ్చిందని అంటున్నారు. అంతేకాదు ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సాధించినప్పటికీ ఆరుజిల్లాల్లో ఖాతా తెరవలేకపోవడం బీజేపీని కూడా షాక్ కు గురిచేస్తోంది. అమ్రేలీ, నర్మద, పోరుబందర్, ఆనంద్, డాంగ్స్, తాపి జిల్లాల్లో ఒక్క స్థానంలోనూ బీజేపీ గెలవలేకపోయింది.