తమిళనాడును ఆదర్శంగా తీసుకోండి...
posted on Dec 19, 2017 10:22AM
.jpg)
డీసీఐ (డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ప్రైవేటీకరణపై ఉద్యోగులు నిరసన వక్తం చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఈ ఉద్యోగులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు కూడా ప్రకటించిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు మరోసారి దీనిపై పవన్ ట్విట్టర్లో స్పందించాడు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా కలసి లాభాల్లో ఉన్న డీసీఐ ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకోవాలని.. దానికోసం ఢిల్లీకి వెళ్లి, ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఓ వినతిపత్రాన్ని ఇవ్వాలని సూచించారు. ఈ విషయంలో తమిళనాడును ఆదర్శంగా తీసుకోవాలని, నష్టాల్లో ఉన్నప్పటికీ, సేలం స్టీల్ ప్లాంటును ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా ఆ ప్రభుత్వం అడ్డుకుంటోందని గుర్తు చేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రజల వెనుక అక్కడి నేతలు నిలబడగా లేనిది, మన రాష్ట్రంలో నేతలు మాత్రం అదే తరహా సమస్య పరిష్కారానికి ముందడుగు వేయకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అన్నారు. ఏపీ నేతలను ఎవరు ఆపుతున్నారో అర్థం కావడం లేదని తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శించారు.
