పవన్ అభిమాన సంఘం... చిరు ఫ్యాన్స్‌తో కిరికిరి...
posted on Sep 8, 2014 2:52PM
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొత్తగా అభిమాన సంఘాన్ని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువత పేరుతో అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. చిరంజీవి అభిమాన సంఘం భేటీ కంటే ముందే పవన్ కళ్యాణ్ అభిమానులు భేటీ కావాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ సమావేశం రాజమండ్రి లేదా విజయవాడలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య చీలిక వచ్చిన విషయం తెలిసిందే. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న చిరంజీవి అభిమాన సంఘాల సమావేశానికి హాజరు కావద్దని హైదరాబాద్ నుంచి, అది కూడా చిరంజీవి కాంపౌండ్ నుంచి ఆదేశాలు జారీ అయినట్టు పవన్ అభిమానులు చెబుతున్నారు.