విద్యుత్ కొనుగోల్లో ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనున్నది


రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలోనే స్పష్టత ఇవ్వనుందా లేదా అనేది చర్చనీయాశంగా మారింది. పునఃసమీక్ష పేరిట ధరలు తగ్గించాలనే ఉత్పత్తి సంస్థలపై ఒత్తిడి వంటివి సరికాదనే నిర్ణయానికి వచ్చింది. ఏపీలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పునఃసమీక్ష జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివాదాస్పదం కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుదుర్చుకున్న పీపీఎలను మరో పార్టీ అధికారంలోకి రాగానే రద్దు చేస్తామనడం పునఃసమీక్ష పేరిట ధరలు తగ్గించాలని ఉత్పత్తి సంస్థలపై ఒత్తిడి వంటివి సరికాదనే నిర్ణయానికి వచ్చింది. ఈ వ్యవహారం పై మొత్తం అన్ని రాష్ట్రాలకు స్పష్టత ఇవ్వాలని భావిస్తొంది. పవన సౌర విద్యుత్ సంస్థ లతో కుదుర్చు కున్న పీపీఏ లకు రాష్ట్ర ప్రభుత్వాల డిస్కాంల కట్టుబడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.

ఈ నెల పదకొండు పన్నెండు తేదీల్లో గుజరాత్ లో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కె సింగ్ నేతృత్వం లో అన్ని రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ భేటీకి సంబంధించిన ప్రధాన ఎజెండా లో పీపీఏల అంశాన్ని కూడా చేర్చారు. ఉత్పత్తి సంస్థ లతో కుదుర్చుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని కేంద్ర మంత్రి సూచించ పోతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఒప్పందాలనూ కొన్ని రాష్ట్రాలు పాటించకపోవడం వల్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని తద్వారా కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాలకు భంగం వాటిల్లుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా పెట్టుబడుల సమస్య కూడా ఏర్పడుతుంద ని కేంద్రానికి వివరించారు. విద్యుత్ సంస్థలు కూడా ఆర్థికంగా నష్టపోతామని తద్వారా బ్యాంకు రుణాల తిరిగి చెల్లింపులు నిలిచిపోయి బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంద ని నివేదించారు. పీపీఏల రద్దు తో తలెత్తిన పర్యావసనాలపై సీఎం జగన్ కు ఆర్ కె సింగ్ ఇప్పటికే లేఖ కూడా రాశారు.

ఇలాంటి పరిస్థితులు ఇతర రాష్ట్రాల్లో తలెత్తకుండా చూడటమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని తెలుస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థలకు సకాలంలో చెల్లింపులు జరగడం లేదని కేంద్రానికి ఫిర్యాదులొచ్చాయి. ఒక్క ఏపీలోనే పలు విద్యుత్ సంస్థలకు డిస్కాం లో పదమూడు వేల నలభై ఆరు కోట్ల మేర బకాయి పడినట్టు కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే అనేక రాష్ట్రాల్లో బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం లేదనే విషయం కూడా కేంద్రం దృష్టికి వచ్చింది. ఈ అంశాలన్నింటిపైనా విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో కేంద్రం అన్ని రాష్ట్రా లకు మార్గ నిర్దేశం చేసే అవకాశం ఉందని తెలిసింది. ఏపీ కేంద్రం ఇప్పటికైనా విద్యుత్ కీలక నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది చూడాలి.