పాటేసుకున్న రవితేజ హన్సిక

 

"బలుపు" వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రవితేజ నటిస్తున్న తాజా చిత్రం "పవర్". ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతుంది. కొరియోగ్రాఫర్ రాజు సుందరం నేతృత్వంలో హీరోహీరోయిన్లపై పాటను చిత్రీకరిస్తున్నారు. హన్సిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో రవితేజ మాస్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాక్ లైన్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్లో నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu