ఇళ్లు కాలుతుంటే సెల్ఫీలు.. బుక్కయిన పోలీసులు


ఈ మధ్య ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు దిగడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. అలా సెల్ఫీలు దిగుతూ బుక్కయ్యారు ఇద్దరు పోలీసులు. ఈ ఘటన న్యూయార్క్ లో చోటుచేసుకుంది. న్యూయార్క్ శివార్లో అగ్నిప్రమాదం జరిగి ఓ వైపు ఇళ్లు కాలి బూడిదైపోతున్నాయి. ఇదిలా ఉంటే పోలీసు అధికారులు మాత్రం నింపాదిగా సెల్ఫీలు తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యారు. ఇంకేముంది వీరిపై అక్కడ సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో అన్ లైన్లో విపరీతంగా షేర్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీనికి స్పందించిన కమిషనర్ థామస్ క్రంప్టర్ వీరిపై కచ్చితంగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని.. భారీ ఆస్తినష్టం సంభవించిందని, ప్రాణ నష్టం మాత్రం జరగలేదని అధికారులు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu