చంద్రబాబుకు ముద్రగడ లేఖ... మీకు ఏమివ్వాలి...


కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కాపునేత ముద్రగడ పద్మనాభం ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఎప్పటికప్పుడు పోరాటం చేస్తానంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముద్రగడ చంద్రబాబుకు లేఖ రాశారు. ‘చావో రేవో తప్ప మా పోరాటానికి విరామం లేదు.. మమ్మల్ని ఓడించే ప్రయత్నం చేస్తే మీరు ఓడిపోవడం ఖాయం. మాకు మీరు బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటే.. మీకు మేం ఏమిచ్చుకోవాలో చెప్పాలి. బీసీలను రెచ్చగొట్టే మానుకోవాలి. మా ఉద్యమానికి బీసీలతో పాటు గిరిజనులు, హరిజనులు అన్ని కులాల వారు మద్దతు తెలుపుతున్నారు’ అని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ విధానానికి నిరసనగా రేపు రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. మరి దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu