గుంటూరు పోలీసులు సైకో సాంబ డబ్బుకు ఆశపడ్డారా?
posted on Jul 17, 2012 11:44AM
గొర్రె కసాయివాడిని నమ్ముతుంది. గుంటూరు పోలీసులు అమాయకంగా కనిపించే సైకో సాంబశివరావును నమ్మారు. ఒంటిమీద ఒక్క దెబ్బ పడకుండా అన్నీ నిజాలే చెప్పాశాడని తెగ సంబర పడిన పోలీసులను సైకో సాంబ భలే బకరాలను చేశాడు. నాలుగురోజులనుండి 300 మందిపోలీసులు సైకో సాంబ కోసం అడవంతా జల్లెడ పడుతున్నారు. పోలీసులకు కొండపల్లి ఖిల్లాలోని పాములు, తేళ్లు ఎక్కడ కరుస్తాయోనని భయం ఒకవైపు తేలిగ్గా ఎస్కేపయిన సైకోసాంబడిమీద కసి ఒకవైపు కలచివేస్తోంది. చిన్న చిన్న నేరాలను చేసివాళ్లమీద, నిందుతుల మీద ప్రతాపం చూపించే పోలీసుపెద్దలు సాంబడు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. కుటుంబ జీవితం బాగోలేక అలా ప్రవర్తించాను బాబయ్య నేను కూడా మంచి కుటుంబాన్ని కలిగివుంటే అలా అయ్యేవాడినే కాదు. ఇప్పటినుండి మంచి గా మారి కలిగి సామాన్య జీవితం గడుపుతాను అంటూ అమాయకంగా చెప్పాడు. దానితో వేటగాడు వాల్మీకి అయ్యాడనుకొని పోలీసులు నమ్మారు. పోలీసు రికార్డుల్లో ఉన్నట్లు సైకోసాంబ రెండేళ్లనుండే దొంగతనాలు మొదలుపెట్టలేదంట. గత పది సంవత్సరాలుగా తను దొంగతనాలు చేస్తూనే ఉన్నానన్న సైకో దొంగతనానికి వేళ్లేముందు కిటికీలు తెరుస్తాడట. ఆతర్వాత ఇంట్లో ఆడవాళ్లే ఉన్నారా...లేకపోతే మగవాళ్లు కూడా ఉన్నారా అని ఆరా తీసి ఆడవాళ్లే ఉన్నారనేది నిర్థారణ చేసుకున్న తరువాతే ఇంటిలోకి ప్రవేశిస్తానని పోలీసులకు చెప్పాడు.
అంతేకాకుండా ఆడవాళ్లని తన పైశాచికత్వంతో హింసిస్తాడని కూడా చెప్పాడని పోలీసులు ఉటంకిస్తున్నారు. అయితే నమోదు అయిన కేసుల కంటే నమోదు కాని కేసులే ఎక్కువుంటాయని చెబితే అన్ని నిజాలే చెప్పేశాడని పోలీసులు మురిసిపోయారు...చివరికి నామీద చిన్న చిన్న కేసులే పెట్టండి నేను మారి మంచిజీవితం గడుపుతాను అని కూడా బోల్డంత అమాయకత్వం నటించేసరికి పోలీసులు మెత్తబడి అలాగే అంటూ మాటకూడా ఇచ్చేశారు.
నన్ను కొట్టినా హింసించినా లేదా జైల్లో పెట్టినా చచ్చిపోతాను అని చెబితే ఎందుకొచ్చిందిలే తంటా అనుకున్న పోలీసులు బంగారం ఎక్కడున్నది చెప్పమంటే కొండపల్లి ఖిల్లా మీద ఉంచానని తీసుకెళితే ఇస్తానన్నాడు. పది మంది పోలీసులు చేతులకు కాళ్లకు గొలుసులు వేసి వెంటబెట్టుకు వెళ్లారు. నడవటానికి ఇబ్బందిగా ఉందంటే ఒక కాలికి చేతికి వేసిన బేడీలు కూడా తీసి ఒకకాలికి చేతికి మాత్రమే ఉంచారు. పైకి వెళ్లిన తరువాత కళ్లముందే 100 మీటర్ల లోతు లోయలోకి జారిపోతుంటే పోలీసులు ఏంజరుగుతుందో తెలివిలోకి తెచ్చుకునేటప్పటికే ఉడాయించాడని చెబుతున్నారు. అయితే ఇక్కడే మరో వాదన వినిపిస్తోంది. సైకో సాంబ తన వద్ద పెద్దమొత్తంలో బంగారం, నగదు ఉన్నట్లు చెప్పడంతో వారు ఆ సంపదపై ఆశపడి అది దొరికితే దానికో ఎంతో కొంత నొక్కేయచ్చన్న ఆశతో కొండపల్లికి తీసుకువెళ్ళి కంగుతిన్నట్లు తెలిసింది. పోలీసులతో మైండ్ గేమ్ ఆడిన సైకో సాంబ పోలీసులకు దొరక్క పోయినా, ఏదో ఒక రోజు వాడి పాపం పండి వాడే దొరుకుతాడు. ఎందుకంటే పెద్ద పెద్ద నేరగాళ్లంత అలాగేదొరికారు. పరిటాల హత్యకేసులో మొద్దు శ్రీను కూడా అలాదొరకిన బాపతే కాని పోలీసులేం పట్టుకోలేదు. అప్పటివరకు ఒంటరిగాఉండే ఆడవాళ్ల పరిస్థితి ఏంటి...ఇదే ప్రశ్న పరిసర గ్రామస్తులను కూడా కంటిమీద కునుకే లేకుండా చేస్తుంది.