ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు
posted on Jun 27, 2018 12:20PM

ప్రస్తుతం ముందస్తు ఎన్నికలు అంశం మీద చర్చ బాగా జరుగుతుంది.. అయితే ఈ విషయంపై స్పందించిన మంత్రి నారా లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. ఐదేళ్లు పాలించాలని ప్రజలు తమకు తీర్పు ఇచ్చారని, ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని లోకేష్ స్పష్టం చేసారు.. అలానే, ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తానని చెప్పిన లోకేష్, సీఎం చంద్రబాబు ఎక్కడ పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడి నుంచి చేస్తానన్నారు.. అదే విధంగా టీడీపీ ప్రభుత్వం నిస్వార్ధంగా పనిచేస్తుందని తెలిపారు.. ‘వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కుప్పం నియోజకవర్గంలో ఒక మీటరు రోడ్డు కూడా వేయలేదు.. కానీ మేం పులివెందులకు కూడా రోడ్లు వేశాం.. ఒక్కసారి కూడా గెలకపోయినా పుంగనూరు నియోజకవర్గానికి రూ.101కోట్లు మంజూరు చేశాం’ అని గుర్తుచేశారు.